calender_icon.png 10 September, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుల తల్లిపై సర్కారు నిర్లక్ష్యం

04-09-2025 12:00:00 AM

  1. రెగ్యులర్ ఇవ్వలేక రెండేళ్లు ఇన్చార్జి
  2. పాలకవర్గం ఖరారు చేయని ప్రజా ప్రభుత్వం
  3. ఆదాయంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు..
  4. పట్టించుకోని జిల్లా యంత్రాంగం

నిర్మల్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం   చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఏవైనా బాసర అభివృద్ధి విషయంలో ఒక అడుగు ముం దుకు మూడు అడుగుల వెనక్కి అనే రీతిలో వివరిస్తున్నారు.

బాసర ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగి ఆదాయ వనరులు పెరుగుతున్న అభివృద్ధి మరియు పరిపాలనపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించునపై భక్తులు మండిపడుతున్నారు. తెలంగాణ వస్తే బాసర ఆలయం ఎంతో అభివృద్ధి చెంది పర్యాటక టూరిజ దేవాదాయ కేంద్రంగా ఎదుగుతుందని ఆశపడ్డ జిల్లా వాసులకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు భక్తులకు శాపంగా మారుతున్నాయి.

బాసర ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర చత్తీస్గడ్ ఒరిస్సా కేరళ కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించుకుంటున్నారు. అయితే బాసర ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ప్రభుత్వం నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వివరించడమే ఇందుకు కారణం. టిఆర్‌ఎస్ ప్రభుత్వం 100 కోట్లతో బాసర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో ప్రకటించిన అది కార్యరూపం దాల్చలేదు.

2023 డిసెంబర్లో రాష్ట్రంలో పదేళ్లు పాలించిన టిఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రజా పాలన ప్రభుత్వం అధికారులకు వచ్చింది. ప్రభుత్వం అధికారులకు వచ్చి 21 నెలలు గడుస్తున్న బాసర ఆలయ అభివృద్ధి పరిపాలనపై ఇప్పటికి నిర్లక్ష్యంగానే వివరిస్తుందన్న విమర్శలు వినవస్తు న్నాయి

సరస్వతి దేవికి ఇన్చార్జిలే దిక్కు..

దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం బాసర ఆలయ నిర్వహణ అధికారులను రెగ్యులర్ అధికారులుగా ఇప్పటికీ నియామకం చేపట్టకపోవడమే సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయా లు బాసర అమ్మవారి ఆలయం ప్రధానమైనప్పటికీ ఇక్కడ రెగ్యులర్ ఈవో లేకపోగా ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుండి ఈ ఆలయానికి రెగ్యులర్ ఈవో ఇప్పటివరకు నియమించలేదు. గతంలో ఇక్కడ ఈవోగా పనిచేసిన విజయ్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి పొందగా ఆయన ఆది లాబాద్ నిజామాబాద్‌లో విధులు నిర్వహి స్తూ ఇక్కడ ఇన్చార్జి ఈవోగా విధులు నిర్వహించారు. ఆయన పని భారం వల్ల తప్పుకోవడంతో ఘట్కేసర్ ఈవో సుధాకర్ రెడ్డిని ఈవోగా నియమించారు.

తాజాగా అంజనాదేవిని సరస్వతి ఆలయ ఈవోగా రెండు రోజుల క్రితమే దేవాదాయ శాఖ ఇన్చార్జిగా నియమించింది. అంటే ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటివరకు బాసరకు ఇన్చార్జి ఈవోలతోని ప్రభుత్వం నెట్టుకు రావడం పై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ ఈవో లేకపోవడంతో ఆలయంలో పరిపాలనలో ఇబ్బందులు తలెత్తి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి గతంలో లడ్డు పులిహోర కౌంటర్లను నిర్వహించే ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి నకిలీ టికెట్లతో టోకెన్లతో అవినీతి అక్రమాలకు పాల్పడగా ఐదుగురు సిబ్బందిపై వేటుపడింది. బాసర టెంపుల్ లో ఆరునెల క్రితం హుండీలు చోరీకి గురయ్యాయి.

బాసర ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన అతిథి గృహాలు విశ్రాంతి గదులు అక్రమాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక్కడ విధులు నిర్వహించి దేవాదాయ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల భక్తులకు కనీస సదుపాయాలు కల్పించడం లేదు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచకపోవడం అన్నదానం కూడా కేవలం 300 మందికి మాత్రమే ప్రతిరోజు పెట్టడం అక్కడ విధులు నిర్వహించి కొందరు ముఖ్య ఉద్యోగులు వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వివరిస్తున్నారు.

ఇక్కడ రెగ్యులర్ ఈవో విధులు నిర్వహిస్తే అవినీతి అక్రమాలు నిర్మూలించడమే కాకుండా పరిపాలనపై మరింత పట్టు సాధించి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రెగ్యులర్ ఈవో నియమించకపోవడంపై జిల్లా ప్రజా ప్రతినిధులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాసర ఆలయానికి హుండీ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్న ఆలయ నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా మారుతుంది.

ఇటీవల జరిగిన వివిధ ఉత్సవాల్లో క్యూ లైన్ లో నిలబడ్డ భక్తులకు కనీసం మంచినీళ్లు ఇచ్చే పరిస్థితి దేవాదాయ శాఖ తీసుకోలేదు. బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం గతంలో రూపాయలు 54 కోట్లు నిధులు విడుదల చేసినప్పటికీ ఈ నిధులు ఖర్చు చేయకుండానే తిరిగి వెనక్కి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. 

పాలకవర్గంపై అసలు శ్రద్ధ లేదు

బాసర అభివృద్ధి కోసం ప్రభుత్వం తో పాటు పాలకవర్గం ఏర్పాటు చేస్తే బాసర మరింత అభివృద్ధి చెంది భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం ఉన్న పాలకవర్గం ఏర్పాటుపై ప్రభుత్వలకు శ్రద్దయ్యలేదని తెలుస్తోంది. బాసరలో ఆలయ పాలకవర్గం శాశ్వత అధ్యక్షుడిగా శరత్ పాటక్ వివరిస్తుండగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో పాలకవర్గాన్ని ప్రభుత్వం ఖరారు చేయవలసి ఉంది.

2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలకవర్గారిని ఏర్పాటు చేయగా 2020 తో పాలకవర్గం ముగిసింది. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023లో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కొత్త పాలకవర్గాన్ని ఖరారు చేయలేదు. దీంతో ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి నెలకొంది. బాసర ఆలయ అభివృద్ధి కి ప్రభుత్వం నిధులు విడుదల చేసిన దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వెనుక పాలకవర్గం లేకపోవడమే కారణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాసర ఆలయ అభివృద్ధిపై ఇటీవలి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నిధులు విడుదల చేయాలని కోరగా ఆమె బాసర వచ్చి నిధులను విడుదల చేసి పాలకవర్గాన్ని ప్రకటిస్తామని చెప్పిన ఇంతవరకు ఆహామీ నిలబెట్టకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాసర ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడమే ఎందుకు నిదర్శనమని బహిరంగంగానే విమర్శలు వినవస్తున్నాయి.

జిల్లా కలెక్టర్ బాసర ఆలయానికి ప్రత్యేక అధికారిగా బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా దేవాదాయ శాఖ దాన్ని రద్దు చేయడంపై చర్చ జరుగుతుంది. కలెక్టర్ తీసుకున్న నిర్ణయం 24 గంటలు గడవకముందే దేవాదాయ శాఖ బాసరకు కొత్త ఈవోగా అంజనాదేవికి ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించడం పై అసలు బాసరలో ఏం జరుగుతుందన్న చర్చ జరుగుతుంది.

ఇటీవల బాసర ఆలయం చుట్టూ గోదావరి వరద పెద్ద ఎత్తున మూడు వైపులా చేరుకున్నప్పటికీ అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యంగా వివరించారని భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బాసర ఆలయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు కేటాయించడం రాకుండా దాన్ని అమలుకు ఆలయ పాలకవర్గాన్ని ఖరారు చేయాలని కోరుతున్నారు.