calender_icon.png 17 May, 2025 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజురీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం

17-05-2025 12:19:30 AM

ఆమనగల్, మే 16: ఫీజు రియంబర్స్ మెంట్ పథకం అమలు తీరుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శిస్తుందని టీఎస్‌ఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు రూ.8వేల కోట్ల వరకు ఫీజు రియంబర్స్  బకాయిలు పెరిగిపోయావని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం ఆమనగల్ మండల కేంద్రంలో విద్యార్థులతో  కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  ఫీజు రీయింబర్స్మెంట్ పథకం  సకాలంలో అమలు చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని  ఆయన గుర్తు చేశారు.

ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపు లో జాప్యం చేయడంతో ప్రైవేటు కాలేజీలు, అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి లో కళాశాలలో ఉన్నాయన్నారు. దీంతో కళాశాల నిర్వహణ భారం పెరిగి  విద్యాసంస్థలు  మూతపడుతున్నాయని గుర్తు చేశారు. కోర్సులు పూర్తి చేసిన పేద విద్యార్థులు సర్టిఫికెట్లు పొందక ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేక ఉన్నత విద్య అభ్యాసించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

కాలేజీ యజమాన్యాలకు విద్యార్థులకు మధ్య జరిగిన గొడవలు పోలీస్ స్టేషన్ల వరకు వెళుతున్న పట్టించుకోరా? అని రాష్ట్ర సర్కార్ ను నిలదించారు. ’ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు ఓటీఎస్ కింద సెటిల్ చేసి ఇకనుంచి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే చెల్లిస్తామని గతంలో జేఎన్టీయూలోను అసెంబ్లీలోను సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని లక్ష్మీ నివాస్ గుర్తు చేశారు. తక్షణం ఫీజు బకాయిలు చెల్లించకపోతే తదుపరి పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల వంశీ, రాష్ట్ర కోఆర్డినేటర్ సుదర్శన్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్  చిక్కి, సందీప్, టి ఎస్ ఎస్ ఓ  ఆమనగల్ మండల కమిటీ తదితరులు పాల్గొన్నారు.