23-12-2025 12:00:00 AM
ప్రభుత్వాలకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ హితవు
ముషీరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్‌యూపి) వినియోగం పెరిగిపోయి భవిష్యత్తును భయపెడుతున్న తరు ణంలో, మైక్రాన్ నంబర్లతో సంబంధం లేకుం డా తక్షణమే పూర్తిస్థాయి నిషేధం విధించాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.హెచ్. రంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మీడియాతో రంగయ్య మాట్లాడుతూ.. 2022 లో 120 మైక్రాన్ల వరకు నిషేధం ప్రకటించినా అది కేవలం కాగితాలకే పరిమితమైందని విమర్శించా రు.
ప్లాస్టిక్ నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ముఖ్యమం త్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడులు చొరవ చూపి కనీసం 2026 నూతన సంవత్సరం నాటికైనా కఠినమైన చట్టాన్ని ప్రకటించాలని కోరారు. నిర్లక్ష్యం వీడకుంటే న్యాయపోరాటం తప్పదన్నారు. భావితరాలను నాశనం చేసే ప్రభుత్వాల వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెబుతూ, ఉదాసీన వైఖరిని వీడి తక్షణమే ప్లాస్టిక్ రహిత సమాజం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.