calender_icon.png 15 August, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

15-08-2025 01:47:04 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

బూర్గంపాడు, ఆగస్టు14 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలోని వేపలగడ్డ,లక్ష్మీపురం, నకిరిపేట,టేకులచెరువు గ్రామాలలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.అనంతరం పోలవరం గ్రామంలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.

అనంతరం మొరంపల్లి బంజర, నకిరిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థినీలకు ఐటిసి వారి ఆధ్వర్యంలో సైకిల్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్ర మాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో తహశీల్దార్ కెఆర్ కెవి ప్రసాద్,ఎంపీడీవో జమలారెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ చక్రధర చారి,ఎంఈఓ యదు సింహరాజు,సిడిపిఓ రేవతి, ఐటిసి అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ చెంగల్ రావు,మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,మాజీ జడ్పిటిసి విజయ్ గాంధీ, నాయకులు బాదం రమేష్ రెడ్డి,భజన సతీష్, పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కైపు లక్ష్మీనారాయణ రెడ్డి,పంచాయతీ సెక్రటరీలు భవాని,విజయ్, బిందుషా పాల్గొన్నారు.