calender_icon.png 23 December, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు పట్టాల ప్రదానోత్సవం

23-12-2025 12:30:17 AM

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఆంధ్ర మహిళా సభ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్, దుర్గాబాయి దేశ్ ముఖ్ విద్యా ప్రాంగణంలో సోమవారం 18వ స్నా తకోత్సవాన్ని, 2023-25 బ్యాచ్ విద్యార్థులకు పట్టాల ప్రదానోత్సవం ఘనంగా జరుపుకున్నారు.  ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుప్రియ పొత్తూరి, ముఖ్యఅతిథి బుర్ర ఆదిలక్ష్మి కామేశ్వరి, ముఖ్య అధికారిణి, యూనియన్ లెర్నింగ్ అకాడమీ, గౌరవ అతిధి ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు ఉషా కంద, అతిథులు తదితరులు హాజరయ్యారు.

  ఆదిలక్ష్మి కామేశ్వరి మాట్లాడుతూ.. ‘పట్టభద్రత మీ లక్ష్యాన్ని నిర్ధారించింది. దీనిపై దృష్టిని కేంద్రీకరిస్తూ మనస్సు, బుద్ధి, జ్ఞానం ఈ మూడు మంచి కోసం వెచ్చించినప్పుడు సాధికారత ను సాధిస్తారు అంటూ, దుర్గాబాయమ్మ గా రిలా సమాజానికి మార్గదర్శకం కావాలి’ అ న్నారు. ఉత్తమ ర్యాంకును సాధించిన హ ఫీజ్ ఉన్నిసా బేగం, రెండవ ర్యాంకు సాధించిన జి.స్రవంతితోపాటు, ప్రత్యేక విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి పతకాలు అందజేశారు. కళాశాల చైర్‌పర్సన్ డాక్టర్ భారతి, కార్యదర్శి జె.సుధాకరుడు, పాలకవర్గ సభ్యులు డాక్టర్ సీవీరామ్మోహన్, డాక్టర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.