calender_icon.png 21 December, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేసీబీ ఢీకొని కొడుకు మృతి

21-12-2025 12:00:00 AM

తల్లికి గాయాలు

బొంతపల్లి వద్ద ఘటన

గుమ్మడిదల, డిసెంబర్ 20(విజయక్రాంతి): రోడ్డు మీదికి హఠాత్తుగా వచ్చిన జేసీబీ ఢీకొట్టడంతో కొడుకు మృతి చెందగా తల్లికి గాయాలైన సంఘటన గుమ్మడిదల మండలం బొంతపల్లి వద్ద శనివారం జరిగింది.వీరన్నగూడెం  బొంతపల్లి గ్రామానికి మధ్యలో ఉన్న గ్రాన్యూవల్ పరిశ్రమలో బొగ్గు బైలర్ వద్ద లోడింగ్, అన్ లోడింగ్ చేసే జేసీబీ హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో  వీరన్నగూడెం గ్రామానికి చెందిన తల్లి, కొడుకు విశాల్ (25) స్కూటీపై వెళ్తుండటంతో ఢీకొట్టింది.దీంతో విశాల్ అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందగా వెనకాల ఉన్న తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులను ఘటన స్థలానికి చేరుకొని విచారించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.