calender_icon.png 8 August, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో గాంధీభవన్ నుంచి గజ్వేల్ దాకా కుమ్ములాటలే..

08-08-2025 01:45:53 AM

  1. స్థానిక సంస్థల్లో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి 
  2. బీసీ వాదంతో ఆటలాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ 
  3. విలేకరుల సమావేశంలో  ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి

గజ్వేల్, ఆగస్టు 7 : రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని, కాంగ్రెస్ లో గాంధీభవన్ నుంచి గజ్వేల్ దాకా కుమ్ములాటలు, కొట్లాటలే జరుగుతున్నాయి తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని మాజీ ఎఫ్బీసీ చైర్మన్,  బిఆర్‌ఎస్ గజ్వేల్  నియోజకవర్గ ఇన్చార్జ్  వంటేరు ప్రతాపరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన  విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ రాష్ర్టంలో అడ్డగోలు హామీలతో, అమలు కానీ హామీలతో గద్దెనెక్కిన  రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ర్ట ప్రజలను  గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే గాంధీ భవన్ నుంచి గజ్వేల్ దాకా కొట్లాటలు, కుమ్ములాటలు  సెటిల్మెంట్లు, స్కాములతో కొనసాగుతుందని, నాయకులు ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు.

ప్రజలంతా సమస్యలతో సతమవుతు న్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.  కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ అంటూ 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అంటూ ఎన్నికలకు కాలయాపన చేస్తుంటే,  కేంద్రంలోని బిజెపి 42 శాతం లో ముస్లింలకు మత రిజర్వేషన్లు ఇవ్వమంటూ  రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయన్నారు.

తెలంగాణ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి దివాలా అంచుల్లో ఉందని, 6 గ్యారంటీలు 13 హామీలను అమలు చేయలేక బీసీ వాదంతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు.  మరొకసారి బీసీలకు మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద పెండింగ్లో ఉన్న కాలువల పనులను ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి  చేయకపోవడం రైతుల పట్ల కాంగ్రెస్కు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు.

ఇప్పటికైనా అబద్ధాలు మాని ప్రజలకు పనులు చేసి చూపించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, పట్టణ అధ్యక్షుడు నమాజ్ మీరా, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, రాష్ర్ట నాయకులు హైదర్ పటేల్, కౌన్సిలర్ చందు, లక్ష్మాపూర్ స్వామి, నాయకులు రమేష్ గౌడ్, కో ఆప్షన్ ఉమర్, అహ్మద్, నరేష్ గుప్తా, తదితరులున్నారు.