calender_icon.png 19 August, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ రేషన్ కార్డులను మంజూరు చేయండి

19-08-2025 12:00:00 AM

సివిల్ సప్లు శాఖ కమిషనర్ చౌహాన్‌ని కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

ఎల్లారెడ్డి, ఆగస్టు 18  : అరులందరికీ రేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరుతూ రాష్ర్ట సివిల్ సప్లు శాఖ కమిషనర్ చౌహాన్ ని సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో గత పదేళ్లలో ఒక్కరి కుడా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు అనే విషయాన్ని కమిషనర్ కి వివరించారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమైనందుకు, అలాగే ఉన్న కార్డులపై సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నందుకు ఎల్లారెడ్డి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో మిగిలి ఉన్న అరులైన కుటుంబాలకు త్వరితగతిన కొత్త రేషన్ కార్డులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు..కమిషనర్ చౌహన్ సానుకూలంగా స్పందిస్తూ, త్వరలో మిగిలిన అరులందరికీ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కు హామీ ఇచ్చారు.