21-11-2025 12:00:00 AM
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన గ్రాట్యుటీ సీలింగ్ రూ. 25 లక్షలకు పెంచినట్లుగా ప్రకటించింది. కోల్ ఇండియా ఉద్యోగులకు కూడా జులై 1, 2021 నుంచి 25 లక్షల రూపాయల గ్రాట్యుటీ సీలింగ్ పొందాలనే నియమాన్ని పాటిస్తూ గ్రాట్యుటీ యాక్ట్- 1972లోని సెక్షన్-4లోని సబ్ సెక్షన్ 5లో ఇవ్వబడింది. దీనిని బెటర్ టర్మ్ ఆఫ్ గ్రాట్యుటీ అని పిలుస్తారు ఈ నియమం 4(5) ప్రకారం కంపెనీ ఉద్యోగులతో ఏదైనా అవార్డు లేదా ఏదైనా ఒప్పందం కుదుర్చుకుని చెల్లింపు చేస్తే దానిలో ఎటువంటి అభ్యంతరం లేదు.
భారత ప్రభుత్వం 2010 నుంచి గ్రాట్యుటీని రూ. 3.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. కానీ 8వ వేజ్ బోర్డ్ లోని 9.6.0 ఒప్పందం ప్రకారం రూ.10 లక్షల గ్రాట్యుటీని 2007 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు పరి చారు. దీని కింద చాలా మంది ఉద్యోగులు, అధికారులు ప్రయోజనం పొం దారు. బొగ్గు గని ఉద్యోగులకు 2018 మార్చి 29 నుంచి 20 లక్షల రూపా యల గ్రాట్యుటీ సీలింగ్, అధికారులకు 2017, జనవరి ఒకటి నుంచి అమలు పరచడంతో రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక నష్టం జరిగింది.
జాతీయ బొగ్గు వేతన ఒప్పందం 11లో కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ప్రకారం గ్రాట్యుటీ సీలింగ్ అమలు చేయాలనే నిబంధన ఉంది. వెంటనే గ్రాట్యుటీ యాక్ట్ సెక్షన్ 4,(5) కింద కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యం ప్రత్యేక ఒప్పందం చేసుకొని 25 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ అమలు పరచాలని బొగ్గు పరిశ్రమలో పని చేసే ఉద్యోగులు కోరుతున్నారు.
వేణు మాధవ్, ఖమ్మం