calender_icon.png 24 November, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్బందుల్లో మీ-సేవ సిబ్బంది

21-11-2025 12:00:00 AM

రాష్ర్టంలోని ప్రభుత్వ మీ-సేవ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు పెంచాల్సిన అవసరముంది. సర్కార్ కొత్తగా ప్రవేశపెడుతున్న సేవల వల్ల మీ-సేవ సిబ్బందికి రోజురోజుకు పని భారం పెరిగిపోతుంది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ర్టంలోని మీ-సేవ కేంద్రాలు ప్రజలకు అన్ని రకాల సేవలను అందిస్తున్నాయి. అయినప్పటికి గత రెండేండ్లుగా మీ-సేవ కేంద్రాల కనీస వేతనాలు పెంచలేదు.

వార్షిక బోనస్ ఇన్సెంటివ్‌లు చెల్లించలేదు. పీఎఫ్ ఖాతాలను బ్రేక్ లేకుండా కొనసాగించడంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం విధి విధానాలు రూపొందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచడంతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. 

టో కామిడి సతీష్, భూపాల్‌పల్ల్లి