calender_icon.png 17 August, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

16-08-2025 09:07:40 PM

కేంద్రం నిధులతోనే పల్లెల అభివృద్ధి

వాల్మీకులను ఎస్టిలో చేర్చేందుకుకృషి చేస్తా

వాల్మీకి, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ

మహబూబ్ నగర్ ఎంపీ డీ.కే అరుణ

చిన్న చింతకుంట: తెలంగాణలో బిజెపికి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ(MP DK Aruna) అన్నారు. శనివారం మండల కేంద్రంలోని 18 లక్షల ఎంపీ నిధులతో చేపడుతున్న శ్రీ వాల్మీకి, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలక భూమిపూజ చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆమె తెలిపారు. కేంద్రం నిధులతో గ్రామాలలో సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, అంగన్వాడీలో పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం, వీధి దీపాలు, స్మశాన వాటికలు నిర్మిస్తున్నామన్నారు. రేషన్ బియ్యం ఇస్తున్నామని అదేవిధంగా ముద్ర, విశ్వకర్మ రుణాలు అందిస్తూ చిరు వ్యాపారులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. రైతులకు కిసాన్ సమ్మన్ నిధులు,  ఒక ఎకరాకు ఏడాదిలో 20 వేలు చొప్పున ఎరువులపై సబ్సిడీనీ ఇస్తూ వారికి అండగా నిలుస్తున్నామన్నారు.

పీఎం ఆవాస్ యోజన కింద నిరుపేదలకు ఇల్లు కట్టిస్తున్నామని, గ్రామాల్లోని పొలాలలో మందులను పిచికారి చేసే డ్రోన్స్ ను కేంద్రం రైతులకు సబ్సిడీపై అందిస్తుందని ఆమె తెలిపారు. ఇచ్చిన మాట తప్పకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కిందని ఆమె తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన చూశారు.ప్రస్తుతం మోసపూరిత కాంగ్రెస్ పాలన చూస్తున్నారు.ఒక్కసారి తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మా పాలన చూడాలని ఆమె కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి బిజెపికి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.సీసీ కుంట మండలంలో అన్ని గ్రామాల సర్పంచులను గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకు చేరవేసే బాధ్యతనాదని, కేంద్రం ఇచ్చే పైసలతోనే ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఆమె తెలిపారు.

రాబోయే స్థానిక ఎన్నికల్లో కేంద్రం చేసే పనులు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని ఆమె తెలిపారు .గ్రామస్థాయిలో పార్టీ గెలిస్తేనే రాష్ట్రంలో అధికారంలోకి బిజెపి వస్తుందని ఆమె తెలిపారు.మోడీ వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపారని ఆమె కోరారు.దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆమె సూచించారు.మండల కేంద్రంలో వాల్మీకి కమ్యూనిటీ హాలుకు తొమ్మిది లక్షలు, ముదిరాజ్ కమ్యూనిటీ హాలుకు 9 లక్షలు ఎంపీ నిధులను మంజూరు చేశామని వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆమె కోరారు .మరల త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకుందామని ఆయా కమ్యూనిటీ కులస్తులకు తెలిపారు.అంతకుముందు శ్రీ వాల్మీకి, గంగాభవాని ఆలయాలలో ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు.ఆయా కమ్యూనిటీ కులస్తులు ఎంపీడీకే అరుణ ను శాలువాతో సత్కరించారు.

వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తా

బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ తెలిపారు .వాల్మీకి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి రాగా వాల్మీకి బోయ కులస్తులు ఎంపీ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాల్మీకి బోయాలను ఎస్టిలో చేర్చే విషయంపై కేంద్ర మంత్రి నీ  కలవడం జరిగిందన్నారు.కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని ఆమె తెలిపారు.ఈ విషయంపై ఇప్పటికే రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ప్రస్తావించడం జరిగిందన్నారు.బోయ వాల్మీకులను ఎస్టిలో చేర్చేందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలిపారు.వాల్మీకి బోయలను ఎస్టిలో చేర్చే దానిపై అపోహలు వద్దని ఆమె తెలిపారు. ఎంపీ సానుకూలంగా స్పందించడంపై వాల్మీకి కులస్తులు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఇంచార్జ్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి, దేవరకద్ర అసెంబ్లీ ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు మెట్టుగాడి శ్రీనివాస్, బిజెపి జాతీయ కౌన్సిల్ నెంబర్ పద్మజా రెడ్డి, రాష్ట్ర నాయకులు యజ్ఞభూపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి, బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజు, అసెంబ్లీ కన్వీనర్ కురువ రమేష్ ,కో కన్వీనర్ భరత్ భూషణ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ రాము, బిజెపి మండల అధ్యక్షులు దశరథ్, నాయకులు వెంకటేశ్వర రెడ్డి, రాములు, హరినాథ్ జి, నరేందర్ జి, మాసన్న, ఆకుల అంజన్న, సి వేణుగోపాల్, లంకల రవి ,వనం నాగేష్, నర్సింలు యాదవ్, బాలస్వామి యాదవ్ ,మహేందర్ యాదవ్, నరేష్, కావలి అంజన్న, బాలచందర్, ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.