27-10-2025 12:00:00 AM
రెయిన్ బో చిల్డ్రన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
నిజామాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆసుపత్రి నిజా మాబాద్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ సంయుక్తంగా, ఫోగ్సీ (FOGSI) సహకారంతో ‘ప్రసూతి, నవజాత శిశు అత్యవసర సంరక్షణ’పై సీఎంఈ, హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్ ఆదివారం నిర్వహించారు. గైనకాలజీ, నియోనాటాలజీ, అనస్థీషియాలజీ, ఫీటల్ మెడిసిన్ నిపుణులు పాల్గొని అత్యవసర సందర్భాల్లో చికిత్సా విధానాలపై శిక్షణ ఇచ్చారు.
నియోనాటల్ రీససిటేషన్ను డాక్టర్ కీర్తి వివరించగా, రక్తస్రావం, ఎక్లాంప్సియా, షోల్డర్ డిస్టోసియా, రక్త మార్పిడి నిర్వహణపై ఆచరణా త్మక శిక్షణ జరిగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ శిరీష ప్రమత, డాక్టర్ అపర్ణ కప్పగంతుల, డాక్టర్ శ్రీలత పట్నాయక్ (గైనకాల జిస్టులు), డాక్టర్ మాధవ్ (అనస్థీటిస్ట్), డాక్టర్ కీర్తి (నియోనాటాలజిస్ట్), డాక్టర్ హిమబిందు (ఫీటల్ మెడిసిన్) చర్చల్లో పాల్గొని, తమ అనుభవాన్ని పంచుకున్నారు. ప్రభుత్వ, ప్రై వేట్ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లి, శిశు మరణాల రేటు తగ్గించడం లక్ష్యంగా ఈ కార్యక్ర మం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రెయిన్‌బో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.