calender_icon.png 27 October, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవీన్‌యాదవ్‌కు కాపు, మున్నూరు కాపుల మద్దతు

27-10-2025 12:00:00 AM

జూబ్లీహిల్స్‌లో గెలుపునకు కృషి చేస్తామని వెల్లడి

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు మిరియాల రాఘవరావు ఆధ్వర్యంలో కాపు, ము న్నూరు కాపు సంఘాలు సంఘీభావం తెలపాయి. ఆదివారం కొండాపూర్‌లోని మిన ర్వా గ్రాండ్ హోటల్‌లో మిరియాల రాఘవరావు (కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు) ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్‌యాదవ్‌కు మద్దతుగా కాపు, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో సంఘాల ప్రతినిధులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నివసిస్తున్న కాపు సభ్యులు పాల్గొన్న ఒక విశాల సభ ఘనంగా జరిగిం ది.

ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ సం క్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనిం గ్, కార్మిక శాఖ మంత్రి వివేక్, పీసీసీ డిసిప్లినరీ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్‌మోహన్, సీనియర్ నేత వి హనుమంతరావు హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. మిరియాల రాఘవరావు సభలో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాపు, మున్నూరు కాపు సమాజం ఐక్యంగా నవీన్‌యాదవ్ విజయాన్ని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రజాహిత సంక్షేమ పథకాలను కొనసాగించడానికి, బలపరచడానికి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించాలి అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాపు సమాజం ఎప్పటి నుండో కాంగ్రెస్ ప్రభుత్వానికి విశ్వాసంతో ఉన్నది. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు, జిహెచ్‌ఎంసి ఎన్నికలు మరియు నామినేటెడ్ పోస్టుల భర్తీలో కాపు సమాజానికి తగిన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని అని తెలిపారు.

మంత్రి వివేక్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో నవీన్‌యాదవ్ విజయం ఖాయం. ఈ విజయాన్ని లక్ష ఓట్ల మెజారిటీతో సాధించే కర్తవ్యాన్ని మనందరం ప్రభావవంతంగా నెరవేర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మిర్యాల ప్రీతం, గాలి అనిల్‌కుమార్, బొమ్మ శ్రీరామ్, దాసరి రంగారావు, శ్రీరామ్ మూ ర్తి, కాపు, మున్నూరు కాపు సంఘాల నాయకులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 600 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.