calender_icon.png 1 July, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనిపించే దేవుడు.. వైద్యుడు

01-07-2025 12:23:08 AM

అలుపెరుగని సేవలకు నిదర్శనం వైద్య వృత్తి

వనపర్తి, జూన్ 30 ( విజయక్రాంతి ) :  వై ద్యో నారాయణ హరి అనగా వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. రోగికి ప్రాణం పోసి నిండు జీవితాన్ని ప్రసాదిస్తాడు. రోగి పరేషాన్, ఏ ఆపరేషన్ చేయాలో అతడికే తె లుస్తుంది. నాడి పట్టి గుండె గుబులు ను గుర్తించి దిగులు దూరం చేసే కనిపించే దేవు డు వైద్యుడు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ ప్రమాదాలను పడిన జీవితాలకు పునర్జన్మని ఇస్తాడు.  పవిత్రమైన వృత్తి లో ఉంటూ విశేష సేవలందిస్తున్న వైద్యులకు సమాజంలో గౌరవం లభిస్తుంది.

భయంకరమైన వ్యాధులు  వచ్చిన వారి వద్దకు వెళ్లేం దుకు కుటుంబ సభ్యులే భయపడుతుంటారు. అలాంటి రోగుల వద్దకు వెళ్లి వైద్య సేవలు చేసేది కేవలం వైద్యులు మాత్రమే. ఉపాధ్యాయులు ఉద్యోగులకు అన్ని ప్రభుత్వ శాఖలకు సెలవులు ఉంటాయేమో కానీ డాక్టర్లకు మాత్రం తీరిక ఉండదు. పిల్ల పాపలతో గడిపేందుకు కుటుంబ సభ్యులకు సమయం వెచ్చించేందుకు అవకాశాలు సైతం తక్కువగా ఉంటాయి. 

రోగుల ప్రాణాలను నిలబెట్టేందుకు వ్యక్తిగత జీవితాలు త్యాగం

 వైద్యులకు ఆదివారాలు లేవు ఆనందాలు లేవు ఎమర్జెన్సీ కేసు వచ్చిందంటే ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిందే. రోగి ప్రాణాలను నిలబెట్టేందుకు వ్యక్తిగత జీవితాలను సైతం త్యాగం చేస్తుంటారు.  ఆరోగ్య పరిస్థితి విషమించో మరే కారణాలతోనైనా  రోగి మృతి చెందితే కుటుంబ స భ్యుల ఆందోళన చేయడం దాడులకు దిగ డం వంటి సందర్భాలు చూస్తూనే ఉంటాం.  ఫలితంగా వారి సేవలకు త్యాగాలకు గుర్తిం పు లభించకుండా పోతుంది.  డాక్టర్లు వ్యక్తిగత జీవితాల్లోనూ మానసిక ఒత్తిళ్లు ఎక్కు వగానే ఉంటాయి. వృత్తిలోని సాధక బాధాకరమైన అర్థం చేసుకోవాలని ఉద్దేశంతో డాక్టర్లు చాలామంది అదే భక్తులు ఉన్న వా రిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. వీరికి వేడుకలు పండగల్లో కంటే  రోగుల సేవలో ఎక్కువగా కనిపిస్తుంటారు. 

డాక్టర్స్ డే నేపథ్యం...

 ప్రముఖ వైద్యుడు పక్షిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బాదన్ చంద్రరామ్ పుట్టినరోజున దేశంలో డాక్టర్స్ డే గా నిర్వహిస్తున్నారు. ఆయన 1882 జులై 1న జన్మించారు. కలకత్తా మెడికల్ కాలేజీలో వైద్య డిగ్రీ పొంది లండన్ లో ఉన్నత విద్యను అభ్యసించి 1911 లో స్వదేశానికి వచ్చి వైద్య సేవలను ప్రారంభించారు. కోల్ కత్త మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేసారు. మహాత్మా గాంధీజీతో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా  1961 భారతరత్న అవార్డు సత్కరించింది.  1962 జూలై 1వ తేదీన ఆయన కన్నుమూశారు. దీంతో ప్రభుత్వం బాదన్ చంద్ర రామ్ జయంతి వర్ధంతిని డాక్టర్స్ డే గా జరుపుకోవాలని సూచించింది. అప్పటినుండి మనదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం ను నిర్వహిస్తు  న్నారు. 

వైద్య సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నా..

 వైద్య వృత్తిలో ఉంటూ రోగులకు వైద్య సేవలు అం దించడంఅదృష్టంగా భావిస్తు న్నాను. ఇష్టంగా ఎంచుకున్న వృత్తిలో  విజయాలు సాధించినప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పదిగా ఉంటుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలను అందిస్తున్న,రోగం తగ్గినా తరువాత వాళ్లు ఎక్కడ కనిపించిన పలకరించే పలకరింపులు మనసుకు సంతోషాన్నిస్తున్నాయి. 

డాక్టర్ శ్రీనివాసులు, ప్రముఖ వైద్యుడు, వనపర్తి