calender_icon.png 12 October, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలు వెలికి తీయాలి

11-10-2025 07:13:25 PM

సీనియర్ హెచ్ఆర్ కన్సల్టెంట్ శ్రీనిధి దశాక

ఘట్ కేసర్,(విజయక్రాంతి): వ్యక్తి గత నైపుణ్యాల పెంపుదలే ధ్యేయంగా మూడు విడతలుగా అనురాగ్ యూనివర్సిటీలో నిర్వహించబడిన "ఎకోస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్" (గ్రూప్ డిస్కషన్) పోటీలు  శుక్రవారం ముగిసినవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీనిధి దశాక, సీనియర్ హెచ్ ఆర్ కన్సల్టెంట్ విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. పోటీలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో దాగిఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి మరియు వాటిని మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఇంకా ఉద్యోగార్థుల ఎంపికలలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనడంలో మంచి దిశానిర్దేశం చేయగలవని తెలియజేశారు.