11-10-2025 07:17:50 PM
ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్..
ఘట్ కేసర్ (విజయక్రాంతి): గురుకుల విద్యాసంస్థల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేసుకుంటూ వస్తున్నామని ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ అన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులు టిసి లు తీసుకొని వెళ్ళిపోవాలని హెచ్ఎం అన్నారని తెలియడంతో శనివారం గురుకుల విద్యాసంస్థ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన హెచ్ఎం పాఠశాల మూయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఘట్ కేసర్ పట్టణానికి ఆనుకుని ఉన్న నాలుగు మండలాల ప్రజలకు అన్ని విధాల అనుకూలంగా ఉన్న విద్యాసంస్థ గురుకుల అన్నారు.
ప్రభుత్వ పరంగా అలాగే తమ సొంత నిధులతో విద్యా సంస్థలను అభివృద్ధి చేయడం జరుగుతుందని, మరో పక్క ఇక్కడ ఉన్న టీచర్ ను మరో గ్రామానికి పంపించడం ఏమిటని, ఎంఈఓ ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. గతంలో మలిపెద్ది సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గురుకుల విద్యా సంస్థలకు లహరి గోడ నిర్మించడం, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో ప్రభుత్వ నిధులు రూ. 1 కోటి 50 లక్షలతో కళాశాల భవన నిర్మాణం జరిగిందని తెలిపారు. కెఎల్ఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఐదు మంది విద్యా వాలంటరీ టీచర్లను నియమించడం జరిగిందన్నారు. గతంలో గురుకుల విద్యా సంస్థలు సీటు దొరకని పరిస్థితి ఉండేదని, వట్టి విద్యాసంస్థలు కేజీ టు పీజీ చేయడానికి ప్రయత్నం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిహెచ్. మచ్చందర్ రెడ్డి, నాయకులు మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, బర్ల దేవేందర్, కేశవపట్నం ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.