08-08-2025 12:00:00 AM
సూర్యాపేట, ఆగస్టు: 7 (విజయ క్రాంతి) : సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు కట్టాలని విద్యా ర్థులను ఎస్ వి కళాశాల యాజమాన్యం వేధింపులు గురి చేయడం సరైన కాదని, డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్ వి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కళాశాలలో జాయిన్ అయ్యేట ప్పుడు ఎలాంటి రుసుములు చెల్లించేది లేదని ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్‌మెంట్‌తో విద్యను అందిస్తా మని మాయమాటలు చెప్పి జాయిన్ అయ్యాక, ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని ఖచ్చితంగా మూడు సంవత్సరాలకుగాను రూ.54000 లు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను యాజమాన్యం ఒత్తిడి తెస్తుందన్నారు.
దీని ద్వారా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులుపై చదువుల కోసం ఎంట్రెన్స్ పరీక్షలు రాయ టం కోసం సర్టిఫికెట్స్ కోసం వెళితే రోజుల తరబడి కళాశాల చుట్టూ తిప్పుకుం టున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం స్పందించి విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అక్కినపల్లి వినయ్ , కొడాలి నాగరాజు,తీగుళ్ల శ్రవణ్, సంపంగి గణేష్, లింగంపల్లి సంధ్య,మిర్యాల దివ్య, బొడ్డు శ్రావ్య,వగ్గు సంధ్య తదితరులు పాల్గొన్నారు.