22-11-2025 12:00:00 AM
పత్తి పంట భారత వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో పింక్‌బాల్ వార్మ్ దాడులు పత్తి రైతులను తీవ్ర సవాళ్లను ఎదుర్కొనే స్థితికి నెట్టేస్తున్నాయి. పత్తి కాయల లోపలికి చేరి గింజలు, నూలు రెండింటినీ పాడుచేసే ఈ పురుగు వల్ల కాయలు బయటకు ఆరోగ్యంగా కనిపించినా లోపల మాత్రం పూర్తిగా నాశనమవుతుంటా యి. ఫలితంగా కోతల సమయంలో రైతులకు దీని అసలు నష్టం తెలుస్తోంది.
ఈ దాడుల కారణంగా పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవ డం, నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఉత్పత్తి వ్యయాలను తిరిగి పొందే అవకాశాన్ని తగ్గిస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలకు భారీగా ఖర్చు పెట్టిన రైతులు చివరికి నష్టాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి తోడు అధిక రుణభారం, మార్కెట్ అనిశ్చితి కారణంగా ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి.
శ్రీనివాస్, జనగాం