calender_icon.png 24 November, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారంగా టెట్ దరఖాస్తు రుసుం

22-11-2025 12:00:00 AM

రాష్ట్రంలో త్వరలో జరగనున్న టెట్ పరీక్షకు సంబంధించిన ఫీజు దరఖాస్తు రుసుం తమకు భారంగా మారిందని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్-2026)కి సంబంధించిన దరఖాస్తు రుసుము పేపర్ 1కు రూ. 750 కాగా.. పేపర్-2కు రూ. 750గా నిర్ణయించారు. ఒకవేళ అభ్యర్థి రెండు పేపర్లకు అర్హత కలిగి ఉంటే దానికి ఫీజును రూ. వెయ్యిగా ప్రకటించారు. మొబైల్‌లో సర్వర్ స్లోగా ఉండడంతో దరఖాస్తులను తీసుకోకపోవడంతో అభ్యర్థులు ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

ఇదే అదనుగా భావిస్తున్న ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు ఒక్కో దరఖాస్తుపై అదనంగా రూ. 150 తీసుకోవడంతో ఒక్క పేపర్‌కు దరఖాస్తూ చేయాలంటే వెయ్యి రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన రెండు పేపర్లకు అర్హత కలిగిన అభ్యర్థులైతే దాదాపు రూ.1200 వరకు చెల్లించుకోవాలి. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ల దరఖాస్తు రుసములు తలకు మించిన భారంగా మారిపోతున్నాయి. ఇప్పటికైనా నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఫీజు దరఖాస్తుల రుసుమును నిర్ణయిస్తారని ఆశిద్దాం.

 ముదిగొండ రమాకాంత్, నల్లగొండ