21-11-2025 12:00:00 AM
పుల్లెంల గణేష్ :
భారతీయ సామాజిక వ్యవస్థలో సంఘ పరివర్తన కోసం.. రాజకీయ సాంస్కృతిక పరివర్తన ఉద్యమాల్లో భాగంగా పోరాడి అమరులైన వారిలో అగ్రవర్ణాల నుంచి అణగారిన వర్గాల వరకు ఉద్భవించిన గొప్ప వీరులు చాలా మందే ఉన్నారు. కాకపోతే అగ్రవర్ణాలు తీసుకొచ్చిన కుల వ్యవస్థ మూలం గా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా.. అగ్ర వర్ణాల చేత తరతరాలుగా దోపిడికి గురై, అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన గొప్ప నాయకుల్లో పీడిత కులాల నుంచి ఉద్భవించిన నాయకులు ఎక్కువగా ఉండటం గమనార్హం.
అందులో భాగంగా ప్రాచీన కాలంలో అగ్రవర్ణ మనువాద బ్రాహ్మణులు తీసుకొచ్చిన కుల అసమాన తత్వా నికి అభిముఖంగా క్షత్రియ కులంలో జన్మించిన గౌతమ బుద్ధుడు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం కోసం విప్లవాత్మక ఉద్యమాన్ని చేశారన్నది జగమెరిగిన సత్యం. ఆధునిక యుగానికి వచ్చేసరికి ఉత్తర భారతం కంటే దక్షిణ భారతంలోని అనేక సాంస్కృతిక పరివర్తన ఉద్యమాలు జరిగాయి.
ఎందుకంటే విదేశాల నుంచి వచ్చిన అగ్రవర్ణ ఆర్యులు ఉత్తర భారతంలోనే వారి శరీర గుణగణాలకి సరిపడా వాతావరణం ఉండడం మూలంగా ఉత్తర భారతంలోని స్థిరనివాసం ఏర్పరచుకోవడం మూలంగా, వారి భయభ్రాం తులకు గురైన వెనుకబడిన కులాలు దక్షిణ భారతానికి వచ్చి స్థిరపడినట్లుగా చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.
దక్షిణ భారతంలో ఉద్యమాలు
అందులో భాగంగానే దక్షిణ భారతం నుంచి అగ్రవర్ణ బ్రాహ్మణ అసమానత్వ సిద్ధాంతానికి అభిముఖంగా తమిళనాడు కేంద్రంగా బీసీ నాయకర్ కులంలో జన్మించిన పెరియార్ సామాజిక సాంస్కృతిక రాజకీయ పరివర్తన ఉద్యమాన్ని చేశారు. ఇక కేరళ నుంచి అగ్రవర్ణ అసమానత్వ సిద్ధాంతానికి అభిముఖంగా సామాజిక న్యాయం కోసం, మనుషుల మధ్య సమానత్వం కోసం నారాయణ గురు ఉద్యమిం చారు.
అలాగే కర్ణాటకలో బసవేశ్వరుడు సామాజిక అసమానతలని రూపుమాపడానికి సమానత్వం కోసం, మనుషులం దరూ సమానమని చెప్పడం కోసం భక్తి ఉద్యమంలో ప్రముఖ సంఘ సంస్కర్తగా ఉన్నారు. ఇక మహారాష్ర్టకి వస్తే మాలి కులంలో జన్మించిన మహాత్మ జ్యోతిరావు పూలే, మహార్ కులంలో జన్మించిన బాబా సాహెబ్ అంబేడ్కర్ వీళ్లు వాళ్ల కులం కోసమే పోరాటం చేయకుండా, సంఘంలోని పీడిత ప్రజల కోసం, అగ్రవర్ణ మను వాద అసమానత సాంస్కృతి మూలంగా దోపిడీకి గురైన అణగారిన సమాజం కోసం పోరాటం చేశారు.
అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో చమర్ (మాదిగ) కులంలో పుట్టిన సంతు రవిదాస్ 500 సంవత్సరా ల క్రితమే చమర్ కులస్తుల కోసమే కాకుం డా బహుజన సమాజ విముక్తి కోసం సాంస్కృతిక ఉద్యమాన్ని కొనసాగించి గొప్ప భక్తి ఉద్యమకారుడిగా చరిత్రలో అమరుడిగా నిలిచారు. సంతు రవిదాస్ శిష్యుడైన గురునానక్ సిక్కు మతంలో గొప్ప సాంస్కృతిక ఉద్యమాన్ని చేపట్టి సమానత్వం కోసం పాటుపడినారు.
ఆత్మగౌరవం కోసం..
ఈ మహనీయుల ఉద్యమ పరంపర లో భాగంగా తెలంగాణ కేంద్రంగా గత దశాబ్ద కాలంగా డా. విశారదన్ మహారాజ్ సమాజంలో పీడితులైన దుఃఖితులైన అణగారిన వర్గాల కోసం సామాజిక సాంస్కృ తిక రాజకీయ పరివర్తన ఉద్యమాన్ని నీతి నిజాయితీతో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.
అందులో భాగంగానే మొద టి ప్రాధాన్యాతలో భాగంగా సమాజంలో అట్టడుగున ఉన్న మాదిగ కులస్తుల కోసం సామాజిక సాంస్కృతిక ఉద్యమం చేపట్టి ఐదు వేల కిలోమీటర్ల మహా పాదయాత్ర లు చేసి మాల, మాదిగ కులస్తుల్లో ఆత్మన్యూనత భావాన్ని తీసివేసి స్వశక్తిగా స్వధర్మంతో స్వరాజ్యం కోసం పోరాడి ఆత్మగౌరంతో బ్రతికేలా మాదిగ కులస్తు ల్లో గొప్ప విప్లవాన్ని సృష్టించారు.
అంతేకాదు సమాజంలో అగ్రవర్ణాలు తీసు కొచ్చిన కులం మూలంగా వెనుకబడిన తరగతులైన బీసీల కోసం సామాజిక సాం స్కృతిక ఉద్యమాన్ని చేయాలని భావించి 2022, మార్చి15 నుంచి 2023, ఏప్రిల్ 30 వరకు 10 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను నిర్వహించి బీసీ కులాల్లో బలమైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విప్లవాన్ని రగిలించారు.
విశారదన్ మహారాజ్ పాదయాత్రల మూలంగానే నేడు తెలంగాణ సమాజంలో బీసీ, ఎస్టీలు తమ జనాభా దామాషా ప్రకారం సమస్త రంగాల్లో, రాజకీయాల్లో వాటా దక్కాలని అగ్రవర్ణ పార్టీలని ప్రశ్నిస్తు ఉద్యమిస్తున్నారని అనేక మంది మేధావులు, విద్యా వంతులు అభిప్రాయ పడుతున్నారు.
కాబ ట్టి ఇక్కడ మనం గమనించాల్సిన చారిత్రక సత్యం ఏంటంటే భారతీయ సమాజంలో అసమానతలు రూపుమాపడానికి సమాజ స్థాపన కోసం ఏ కులంలో పుట్టిన నాయకుడు వారి సొంత కులాలనే సంస్క రించుకోవడం కోసమే ఉద్యమించలేదన్న విషయం స్పష్టమవుతుంది. సంఘంలో పీడనకు గురవుతున్న ప్రతి కులాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది ఆత్మగౌరవంతో బ్రతికేలా ఉద్యమాలు చేపట్టారు.
ప్రజాస్వామ్య పోరాటం..
నేడు తెలంగాణలో బీసీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి పేరుతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమితిలో ప్రధాన వ్యక్తులుగా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ మాజీ కలెక్టర్ టి చిరం జీ వులు, విశారదన్ మహారాజ్, బాలరాజు ఉన్నారు. వీరు చేస్తున్న ఉద్యమానికి ఇంకా అనేక బీసీ, ఎస్సీ, ఎస్టీల సంఘాల నైతిక మద్దతు ఉండడం గమనార్హం.
దీనిలో భాగంగా గత అక్టోబర్ 24న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర వేల మంది బీసీ, పీడిత కూలాలని సమీకరించి భారీ సభను విజయవంతం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్‌కు అభిముఖంగా బీసీల 42 శాతం విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్స్ సాధించడానికి రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిలా 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి పేరుతో ‘బీసీ ఆక్రోశ’ సభను నిర్వహించారు.
ప్రస్తుతం ఉన్న బీసీ నాయకులంతా అగ్రకుల పార్టీలకి కృతజ్ఞులై వారి ఆలోచనలకు బందీగా ఉండడం ఆపేసీ.. బీసీల హక్కుల్ని కాలరాసిన విధానానికి స్వస్తి పలకాలి. ఇకపై బీసీలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ అగ్రకులాలు ఇచ్చే బిక్షకు, మెతుకుల కోసం ఆశపడకుండా, రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య బద్ధమైన హక్కుల కోసం అగ్రకుల పార్టీలకి అభిముఖంగా బీసీ నాయకులు స్వశక్తిగా స్వధర్మంతో నిబద్ధతతో రాజీ పడకుండా పోరాటం చేయాలి.
ఇక్కడ గమనించాల్సిన చారిత్రక అం శం ఏమిటంటే.. భారతీయ కుల, మత అసమానత వ్యవస్థలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరివర్తన కోసం ఉద్య మించిన ఏ మహనీయుడు కూడా ఒక్క కులంలో మార్పులు తీసుకురావడం కో సం పాటుపడకుండా పీడనకి దోపిడీకి గురైన సబ్బండ కులాలని సంస్కరించడం కోసం పాటుపడ్డారు. బీసీ కులాల విముక్తి కోసం సహ బాధితులైన అణగారిన వర్గా ల హక్కుల కోసం, రాజ్యాధికారం కోసం సామాజిక రాజకీయ సాంస్కృతిక పరివర్తన కోసం ఎంతటి నీతి నిజాయితీతో నిబద్ధతతో బీసీ నాయకులంతా పని చేస్తున్నారా లేదా అనే అంశాన్ని చూడాల్సిన అవసరముంది.
ఆధునిక కాలంలో కూడా ఏ కులంలో పుట్టిన వ్యక్తి వారి కులాలనే సంస్కరించుకోవడం కోసం ఉద్యమించాలనుకోవడం ఆధునిక అనాగరిక, అప్ర జాస్వామిక చర్యకు నిదర్శనంగా నిలుస్తుం ది. అంతేకాదు ఇది మానవతా, నైతిక విలువలకు, భారత రాజ్యాంగ మౌలిక భావా లకు వ్యతిరేకమైన అంశం అవుతుందని కుల, మతాలకతీతంగా మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజల సైతం గ్రహిం చాల్సిన చారిత్రక సత్యం.
వ్యాసకర్త సెల్: 95503041549