28-09-2025 12:44:07 AM
-కేంద్ర బొగ్గు గనుల సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి
-నాగోల్ జీఎస్‌ఐ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హీ సేవ’కు హాజరు
-జీహెచ్‌ఎంసీ కార్మికులకు శానిటేషన్ కిట్స్ పంపిణీ
ఎల్బీనగర్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి) : సమాజ శ్రేయస్సు కోసం భారతీయ భూవైజ్ఞానిక సర్వే సంస్థ (జీఎస్‌ఐ) వినూత్న సేవలు అమోఘమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. శనివారం నాగోల్ బండ్లగూడ జీఎస్‌ఐ ఆధ్వ ర్యంలో నిర్వహించిన ‘స్వచ్ఛోత్సవ్ ( స్వచ్ఛ భారత్ మిషన్ ఇనిషియేటివ్ కింద స్వచ్ఛతా హీ సేవ 2025) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండ్లగూడలోని ఆనంద్ నగర్ జంక్షన్ నుంచి మన్సూరాబాద్ రోడ్ లోని జీఎస్‌ఐ మెయిన్ గేట్ వరకు స్వచ్ఛోత్సవ ర్యాలీని నిర్వహించారు.
ఈ ర్యాలీని కిషన్‌రెడ్డితో కలిసి జీఎస్‌ఐ సౌత్ రీజియన్ హెచ్వో డీ, అడిషనల్ డైరెక్టర్ జనరల్ బసాబ్ ముఖోపాధ్యాయ ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జీఎస్‌ఐలో 4 వినూత్న ‘వేస్ట్ టు వెల్త్’ మోడల్స్‌ను ప్రారంభించారు. కార్యాలయ ఆవరణలోని కీ బోర్డులు నుంచి మొక్క కుండీ, గోడ గడియారం, బుద్దుడి బొమ్మ, చెట్టు గోడ ఫోటో ఫ్రేమ్ ని తయారు చేశారు. ‘ఈ వేస్ట్ నుంచి సంపద తయారయ్యే మోడల్స్ ని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. జీహెచ్‌ఎంసీ జీఎస్‌ఐ పారిశుధ్య కార్మికులకు శాని టేషన్ కిట్లను పంపిణీ చేశారు.
అనంతరం జీఎస్‌ఐ మెయిన్‌గేట్‌ఎదుట ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. జీఎస్‌ఐ సౌత్‌రీజియన్ హైదరాబాద్ చేపట్టిన పారిశుధ్య, స్వచ్ఛతా కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేశారు. 175 ఏండ్లుగా దేశానికి అచంచలమైన సేవ చేస్తున్న జీఎస్‌ఐ వినూత్న ఖనిజ అన్వేషణను మంత్రి అభినందించారు. జీఎస్‌ఐ ముఖ్య అధికారి పీవీవీ శర్మ, డైరెక్టర్లు, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ , మన్సూరాబాద్‌కార్పొరేటర్ కొప్పులు నరసింహా రెడ్డి నాగోల్ డివిజన్‌బీజేపీ నాయకులు, మహిళా, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.