calender_icon.png 24 September, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెస్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వాలి

24-09-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 1,650 మంది గెస్ట్ లెక్చరర్లకు గత 10 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని, ప్రభుత్వం వెంటనే జీతాలు విడుదల చేయాలని బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కాగజ్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్లు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలుగాలికి వదిలి కమీషన్లు వచ్చే రంగాలపైనే దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. విద్యాశాఖను కావాలనే తన వద్ద ఉంచుకున్నానని చెప్పిన రేవంత్ విద్యార్థుల బాగోగుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నార ని ఆయన మండిపడ్డారు. అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్‌పై ఆయన విద్యార్థులకు అవగాహ న కల్పించారు. ప్రతి అర్హత కలిగిన డిగ్రీ విద్యార్థికి వార్షికంగా రూ.30,000 స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిగ్రీ కళాశాలలో తలెత్తుతున్న సమస్యలు, పుస్తకాల సరఫరా ఆలస్యం తదితర అంశాలపై విద్యార్థుల నుంచి తెలుసుకు న్నారు. కాగజ్నగర్ మండలానికి చెందిన విద్యార్థి ప్రవీణ్ టీఎస్ సీపీజీఈటీలో రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు సాధించినందుకు అభినందించారు.

ఇటీవల సిర్పూర్ పేపర్ మిల్లులో జరిగిన ప్రమాదంలో కార్మికుడు భాస్కర్ మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిగాచీ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం మాదిరిగానే భాస్కర్ కుటుంబానికి కూడా పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఎందుకు స్పందించట్లదని ప్రశ్నించారు. లేబర్ శాఖ అధికారులు, ఇండస్ట్రీస్ శాఖ ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు ముస్తాఫిజ్, నక్క మనోహర్, అమాన్, శోభన్, నాజిమ్, ఓదేలు తదితరులు పాల్గొన్నారు.