24-09-2025 12:00:00 AM
-మంత్రి జి వివేక్ వెంకటస్వామి
మందమర్రి, సెప్టెంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అన్ని హామీలను అమలు చేస్తామని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి జి.వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.
బీఆర్‌ఎస్ హయాంలో అన్ని రంగాల్లో వెనుకబడ్డామని, పట్టణంలో అభివృద్ధి పనులు లేక రోడ్లు, డ్రైనేజీలు అద్వా నంగా ఉండేవని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రూ. 50 కోట్లను మంజూరు చేసి అభివృద్ధి పనులు వేగవంతం చేశానని స్పష్టం చేశారు. అమృత్ స్కీం ద్వారా పట్టణంలో ఇంటింటికి శాశ్వత మంచి నీరు పథకం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా మాజీ ప్రధా న కార్యదర్శి సొత్కు సుదర్శన్, పుల్లూరి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి చేదు అనుభవం
రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 23 : క్యాథనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ కృష్ణాపూర్ లో కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంగళ వారం సూపర్ బజార్ ఏరియాలో ఏర్పాటు చేసిన మెప్మా భవన ప్రారంభోత్సవం చేసిన అనంతరం మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్న క్రమంలో సభలో ఉన్న మహిళలు మహాలక్ష్మి పథకం కింద రూ.500 కు గ్యాస్ సిలిండర్ రాయితీ తమకు అందడం లేదని మంత్రిని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు.
మంత్రి బయలు దేరుతున్న క్రమంలో మహిళలు ఆయనను కలిసి తమ సమస్యలను చేప్పడానికి వెళ్లగా మంత్రి చుట్టూ నాయకులు, కార్యకర్తలు గుంపుగా ఉంటున్నారని, ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి వెళ్లకుండా నాయకులు, కార్యకర్తలు అడ్డుపడుతున్నారని మహిళలు మండిపడ్డారు. తమ సమస్యలను ఇంకెవరికి చెప్పాలంటూ మహిళలు వెనుదిరిగి వెళ్లారు.