calender_icon.png 19 September, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ఉపాధ్యాయులకు గురు బ్రహ్మ అవార్డులు

19-09-2025 12:00:00 AM

మంచిర్యాల, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మంచిర్యాల ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు గురు బ్రహ్మ అవార్డులు అందజేశారు. బుధవారం రాత్రి మంచిర్యాల గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయిని,

ఉపాధ్యాయులకు, అన్ని మండలాల ఎంఈఓలకు నిర్వహించిన గురు బ్రహ్మ అవార్డ్సు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీపీ ఎగ్గడి భాస్కర్, డిస్టిక్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సంతోష్ కుమార్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు హాజరై అవార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు సిద్దయ్య, ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి ఉదారి చంద్రమోహన్ గౌడ్, ట్రస్మా రాష్ట్ర నాయకులు రాపోలు విష్ణువర్ధన్ రావు, సురభి శరత్ కుమార్, యార్లగడ్డ బాలాజీ, రాం వేణు, అఖిలేందర్ సింగ్, బద్ధం పురుషోత్తం రెడ్డి, డేనియల్ రాజ్, జిల్లా గౌరవ అధ్యక్షురాలు గోనె భాగ్యలక్ష్మి, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు కొమ్ము దుర్గాప్రసాద్, వివిధ మండలాల అధ్యక్షులు, ఉపాధ్యాయిని ఉపాద్యాయులు పాల్గొన్నారు.