09-07-2025 12:33:55 AM
ఎల్బీనగర్, జులై 8: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ రాష్ట్రానికి, ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని టీ పీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా మన్సూరాబాద్ వైఎస్‌ఆర్ చౌరస్తాలో ( కామినేని హాస్పిటల్ ) ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహన్ని మంగళవారం ఆవిష్కరించారు.
టీ పీసీసీ కార్యదర్శి శ్రీ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్యదర్శి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ తదితరులు విగ్రహాన్ని ఆవిష్కరించి, వైఎస్సార్ కు నివాళులర్పించారు. కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ చైర్ పర్సన్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ పన్యాల జైపాల్ రెడ్డి, నాయకులు ఎండీ జానిమియా, కందికంటి శ్రీధర్ గౌడ్, మొకిల్ల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసేవకు తన రాజకీయ జీవితాన్ని అంకితం చేసివారిలో వైఎస్సార్ అ గ్రగణ్యులని కాంగ్రెస్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి కొనియాడారు. రామకృష్ణాపురం డివిజన్ లోని చిత్రలేఅవుట్ లో వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమం లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, రామకృష్ణ పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, మైసమ్మ చైర్మన్ సురేశ్, నాయకులు ముస్కు అంజిరెడ్డి, రాజు నాయక్, లింగస్వామి గౌడ్, పగడాల ఎల్లయ్య, కిరణ్, శ్రీశైలం, రామకృష్ణ గౌడ్, పెద్దవూర సైదులు, ప్రేమ నాయక్, సందీప్, నబి, శ్రీనివాస్ గుప్తా, మహమ్మద్, నర్సింహచారి, పటేల్, షఫి, అనుదీప్, స మ్మద్, జగన్నాథం, చందు, సూరి, వెంకటేష్ గౌడ్, సలీం, విప్లవ రెడ్డి, నాను, సుజాత రెడ్డి, మాధవి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.