12-09-2025 01:08:46 AM
చిట్యాల, సెప్టెంబర్ 11(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీ నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పలువురు బిఆర్‌ఎస్ పార్టీ కి రాజీనామా చేసి గుత్తా అమిత్ కుమార్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లోని వారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
వారికి ఆయన పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారి లో అంతటి నాగరాజు, అంతటి నరేష్, వేలిమినేటి లింగారెడ్డి, మర్రి రాములు , మర్రి శంకరయ్య, జనపాల స్వామి, కురుపటి ఊషయ్య, వడ్డేపల్లి నర్సింహ, బొడ్డు యాదయ్య, బొడ్డు రాము తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమమం లో మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సీనియర్ నాయకుడు పల్లపు బుద్ధుడు, మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య, జనపాల శ్రీను, కురుపటి లింగయ్య, పాకాల దినేష్, బోయ స్వామి, రూపని చంద్రయ్య, బోయ రాములు, బోయ లక్ష్మయ్య, మర్రి సత్తయ్య, జనపాల రాము, వసుకుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.