12-09-2025 01:09:49 AM
-జగన్‌మోహన్‌రెడ్డి సన్నిహితుడు సునీల్‌రెడ్డికి చెందిన కంపెనీలో సోదాలు
-హైదరాబాద్, విశాఖపట్నంలో ఏకకాలంలో తనిఖీలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు లో దర్యాప్తును సిట్ వేగం పెంచింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న నర్రెడ్డి సునీల్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో గురువారం అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖపట్నంలోని 10 కంపెనీల కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరిగాయి.
సిట్ పక్కా ప్రణాళికతో హైదరాబాద్‌లోని సునీల్‌రెడ్డికి సంబం ధించిన కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని స్నేహహౌస్, రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్, -రాజేంద్రనగర్, ఖైరతాబాద్ కమలాపురి కాలనీ ఫేజ్-1లోని కార్యాలయాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. విశాఖపట్నం వాల్తేరు రోడ్డులో ఉన్న కార్యాల యంలోనూ సోదాలు కొనసాగాయి.
సునీల్‌రెడ్డి హైదరాబాద్‌లో 8 కంపెనీల కార్యక లాపాలను నాలుగు కార్యాలయాల నుంచి, విశాఖలో రెండు కంపెనీల కార్యకలాపాలను ఒకే కార్యాలయం నుంచి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మద్యం కేసులో జగన్ సన్నిహితుడిని లక్ష్యంగా చేసుకుని సిట్ దా డులు చేపట్టడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.