calender_icon.png 23 November, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి రోజు సగం.. సగం

23-11-2025 12:00:00 AM

  1. తడబడి పుంజుకున్న భారత బౌలర్లు 

తొలి రెండు సెషన్లు సౌతాఫ్రికావే

భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. తొలి రెండు సెషన్లలో సఫారీలు ఆధిపత్యం కనబరిస్తే.. చివరి సెషన్‌లో భారత్ బౌలర్లు పుంజుకున్నారు. ఒక దశలో భారత బౌలర్లు, ఫీల్డర్ పేలవ ప్రదర్శన చూస్తే సౌతాఫ్రికా భారీస్కోర్ ఖాయంగా కనిపించింది. అయితే చివరి సెషన్‌లో కుల్దీప్ యాదవ్ వికెట్లు తీసి సౌతాఫ్రికాను కట్టడి చేశాడు. ఫలితంగా తొలిరోజును ఇరు జట్లు సమాన ఆధిపత్యంతో సంతృప్తికరంగా ముగించాయి. 

గుహావటి, నవంబర్ 22 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. గిల్ స్థానంలో నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్ స్థానంలో సాయి సుదర్శ న్ జట్టులోకి వచ్చారు. తొలి సెషన్‌లో భారత  బౌలర్లు ఎవ్వరూ ప్రభా వం చూపలేకపోయారు. దీంతో సఫారీ ఓపెనర్లు మార్క్మ్,్ర రికెల్టన్ కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్ చేస్తూ తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించారు.

టీ బ్రేక్‌కు ముందు మార్క్మ్(్ర38)ను బుమ్రా బౌల్డ్ చేయడంతో తొలి వికెట్ దక్కింది. రెండో సెషన్ ఆరంభమైన కాసేపటికే రికెల్టన్ (32) కూడా ఔటయ్యాడు. ఈ దశలో సౌతాఫ్రికాను బవుమా, స్టబ్స్ ఆదుకున్నారు. అప్పుడప్పుడూ సింగిల్స్ తీస్తు అసలు సిస లు టెస్ట్ బ్యాటింగ్ ఆడారు. దీంతో పరుగులు వేగంగా రాకున్నా వికెట్ కోల్పోలేదు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా వీరి పార్టనర్‌షిప్‌ను బ్రేక్ చేయలేకపోయిది.

స్టబ్స్ (49), బవుమా(41) మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని జడేజా విడదీశాడు. బవుమా ఔటైన కాసేపటికే స్టబ్స్ కూడా వెనుదిరగడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ముల్దర్ వికెట్ తో సఫారీ ఇన్నింగ్స్ త్వరగా ముగిసేలా కనిపించినా ముత్తుసామి, జోర్జీ కీలక పార్టన ర్‌షిప్ నెలకొల్పారు. ఆరో వికెట్‌కు 45 పరుగులు జోడించారు.

ఈ దశలో సిరాజ్ కొత్త బంతిని అందుకున్న తర్వాత జోర్జీ(28) ఔట్ చేయడంతో సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. అయితే వెలుతురు మందగించడం తో మరో 8.1 ఓవర్ల ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేశారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 6 వికెట్లకు 247 పరు గులు చేసింది. ముత్తుసామి 25, వెరెన్నే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా, సిరాజ్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.

స్కోర్లు :

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 247/6 (స్టబ్స్ 49, బవుమా 41, మాక్‌ర్రమ్ 38, రికెల్టన్ 35;  కుల్దీప్ యాదవ్ 3/48, జడేడా 1/30, బుమ్రా 1/38, సిరాజ్ 1/59)