23-11-2025 12:00:00 AM
పెర్త్, నవంబర్ 22 : ప్రతిష్టాత్మక యాషె స్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ట్రావిడ్ హెడ్ విధ్వం సకర శతకంతో కేవలం రెండురోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. బౌలర్ల హవా కనబరిచిన పెర్త్‌లో రెండోరోజు హెడ్ స్టన్నింగ్ సెంచరీ హైలెట్‌గా నిలిచింది. ఈ విజయం తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1 ఆధిక్యంలో నిలిచింది. తొలిరోజే 19 వికెట్లు పడడంతో రెండోరోజుపై ఆసక్తి పెరిగింది.
ఓవర్‌నైట్ స్కోర్ 123/9తో రెండోరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 9 రన్స్ మాత్రమే జోడించగలిగింది. 132 పరుగులకు ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. 40 పరుగుల ఆధిక్యంతో ఉత్సాహం గా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాం డ్ ఖాతా తెరవకుండానే క్రాలే వికెట్ కోల్పోయింది. తర్వాత డకెట్, పోప్ 65 పరుగులు జోడించడంతో మంచి స్కోర్ చేసేలా కనిపించింది. అయితే ఆసీస్ పేసర్ స్కాట్ బొలాం డ్ వీరిద్దరినీ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ వికెట్ల పతనం మొదలైంది. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క ఇంగ్లాండ్ బ్యాటర్ రెండోఇన్నింగ్స్‌లోనూ రాణించలేదు.
అటు స్టార్క్ కూడా నిప్పులు చెరగడంతో ఇంగ్లాండ్ రెం డో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. బొలాండ్ 4/33, స్టార్క్ 3/55, డోగెట్ 3/51 వికెట్లతో రాణించారు. 205 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఇబ్బందిపడుతుందని అంతా అనుకున్నారు. అయితే ట్రావిడ్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.
టీ ట్వంటీ తరహాలో రెచ్చిపోయిన హెడ్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా మార్చేశాడు. హెడ్ కేవలం 69 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా యాషెస్ సిరీస్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో గిల్‌క్రిస్ట్ 57 బంతుల్లో సెంచరీ బాదాడు.
హెడ్ 123 (83 బంతుల్లో 16 ఫోర్లు,4 సిక్సర్లు) రన్స్ చేయగా.. అటు లబూషేన్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి 10 వికెట్లు తీసిన మిఛెల్ స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. సిరీస్‌లో రెండో టెస్ట్ డిసెంబర్ 4న గబ్బాల్లో మొదలువుతుంది. కాగా యాషెస్ సిరీస్‌లో అత్యంత వేగంగా(847 బంతుల్లోనే) ముగిసిన మ్యా చ్‌గా ఈ మ్యాచ్ రికార్డులకెక్కింది.