calender_icon.png 2 January, 2026 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సంవత్సరం సందర్భంగా సాయిమందిరంలో ప్రత్యేక పూజలు

02-01-2026 01:21:35 AM

సర్పంచులకు ఘన సన్మానం

కోదాడ, జనవరి 1: కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామం సాయి మందిరంలో గురువారం సర్పంచులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఘనంగా సాగింది.

చిమిర్యాల గ్రామ సర్పంచ్ కొత్త గురవయ్య, దొరకుంట గ్రామ సర్పంచ్ పాలకి సురేష్, నల్లబండగూడెం గ్రామ సర్పంచ్ అల్సగాని భవాని శరబయ్య, రెడ్లకుంట గ్రామ సర్పంచ్ పోలంపల్లి కుటుంబరావు, ఉప సర్పంచ్ మల్లెల ప్రసాద్, మంగళ్ తండా గ్రామ సర్పంచ్ ధరావత్  బాబ్జీ నాయక్లతో పాటు రిటైర్డ్ డీపీఓ వెంకటేశ్వర్లు ను దేవాలయ కమిటీ సభ్యులు, నాయకులతో శాలువాలతో సత్కరించారు.

అనంతరం  దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు మాట్లాడుతూ, సాయి మందిరంలో ప్రతి గురువారం  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగవరపు లక్ష్మణరావు, రవి, ధరావత్ నాగేశ్వరరావు, శేషు, ఆలయ అర్చకులు సాయి శర్మతో పాటు దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

బాప్టిస్ట్ చర్చ్‌లో.. 

కోదాడ, జనవరి 1: స్థానిక నయా నగర్ లోని బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.  గత సంవత్సరం అంతా దేవాది దేవుడు తన చల్లని రెక్కల కింద కాపాడి ఆయేషారోగ్యాలతో నూతన సంవత్సరంలోకి ప్రవేశింప చేసినందుకు కృతజ్ఞతగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు జరిగించారు.

దేశము తెలంగాణ రాష్ట్రం నాయకులు అధికారులు వైద్యులు కార్మికులు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో ప్రజల వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ క్రిస్టియన్ సభ్యులు వంటిపాక జానకి యేసయ్య బొల్లి ల్లి కొండ కోటయ్య బానోతు జగ్గు నాయక్ హెడ్ కానిస్టేబుల్ జాను రాంబాబు కోటేశ్వరమ్మ ప్రవళిక స్రవంతి శార కవిత కోటేశ్వరి సుధా తదితరులు పాల్గొన్నారు.