30-01-2026 12:13:17 AM
గాంధీనగర్ కార్పొరేటర్ ఎ పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ లోని స్వామి వివేకానంద నగర్ బస్తీ లోని19 మంది దళిత కుటుంబాల ఇళ్లను కూల్చి 2 సంవత్సరాలు పూర్తున ఇప్పటివరకు ప్రభుత్వం ఇళ్లను కేటాయించలేదని, బాధితులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ అలాట్మెంట్ చేయాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమా ర్ అన్నారు.
ఈ మేరకు గురువారం గాంధీనగర్ డివిజన్ లోని వివేకానంద బస్తీ లో ఇండ్లు కూల్చేసి 2 సంవత్సరాలు పూర్తున సందర్భంగా బస్తీ వాసులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్ పాల్గొని బాధితులకు మద్ధతు పలికారు. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, బీజేపీ నేతలు అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సాయి సంతోష్, తరుణ్, డేవిడ్, బస్తీ వాసులు ఎన్ ఆర్ యాదగిరి, శ్యామ్ సుందర్, గ్యాణేష్, ఆనంద్ రావు, సాయి కిరణ్, మున్న, మనోహర్, అన్నపూర్ణ, చంద్రకల, సుశీల తదితరులు పాల్గొన్నారు.