calender_icon.png 22 July, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాషిష్ ఆయిల్ పట్టివేత

06-12-2024 01:01:33 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఒడిశా నుంచి హైదరాబాద్‌కు హాషిష్ ఆయిల్ తరలిస్తున్నారనే  సమాచారం మేరకు ఎక్సై జ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్టీఎఫ్ ఏ టీం పోలీసులు చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన ప్రకా రం.. చందానగర్‌లో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తూ ఓ కారును ఆపి సోదా చేశారు. కారులో 1.5 కిలోల హాషిష్ ఆయిల్ ఉన్నట్లు గుర్తించారు.

ఆయిల్ విలువ రూ.5 లక్షలు ఉంటుందని సిబ్బంది తెలిపారు.  ఆయిల్ తరలిస్తున్న నిందితులను కర్ణాటకకు చెందిన కొండే మల్లికార్జున్, హైదరాబాద్‌కు చెదిన మహమ్మద్ రెహమాన్ ఖాన్‌గా గుర్తించారు. రవాణాతో ప్రమేయం ఉన్న హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్, ఒడిశాకు చెందిన రమేశ్ గంగాధర్ పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇదే బృందం పురాణాపూల్‌లో తనిఖీలు నిర్వహించి 1.1కిలో గంజాయి స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.