14-07-2025 12:00:00 AM
ప్రతిహృదయానికీ-
వెంటాడుతూ వేధించే
దానిదైన వ్యక్తిగత రహస్య మందిరం ఒకటుంటుంది
అక్కడ ఏ చడీచప్పుడూ చేయని మౌనపు వెన్నెల పడుతుంటుంది
అక్కడి నేలపై అంతుచిక్కని పాదముద్రలు కనిపిస్తుంటాయి,
అక్కడి గోడలపై ఏవేవో గుసగుసలు వినిపిస్తుంటాయి!
కదలనివి గానూ, నీడలుగానూ
భూతకాల భూతాలు...
ఆ మౌనపు వెన్నెల విసిరి వేసినవిగా
ప్రత్యేక సమయాల్లో
నన్నూ వెంటాడుతూ వేధిస్తుంటాయి!!
(బయటి ప్రపంచానికి తెలియని, వ్యక్తిగత రహస్య మందిరం ప్రతి హృదయానికీ ఉంటుందని తెలిపే కవిత)
ఆంగ్లమూలం: హెన్రీ డబ్ల్యూ లాంగ్‌ఫెలో
- స్వేచ్ఛానువాదం:
- రఘువర్మ