12-09-2025 12:20:35 AM
ఆస్పత్రికి వచ్చిన రోగి పట్ల వైద్య సిబ్బంది తీరు ఇది !
వంద పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యపు పోకడ
అలంపూర్, సెప్టెంబర్ 11:ప్రజలు అనారోగ్యాల బారిన పడ్డప్పుడు వారికి కనిపించ ని దేవుళ్ళ కన్నా ఎదురుగా కనిపించే డాక్టర్లే దైవ సమానులుగా భావిస్తారు.అందుకేనే మో వైద్యో నారాయణ హరి అన్నారు. అంతటి పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతున్నప్పుడు రోగుల పట్ల నిర్లక్ష్యమనే జబ్బు వారికి ఉండకూడదు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ అనారోగ్య బాధితుల పట్ల వారి తీ రు శాపంగా మారుతోంది.
ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల క్రింది స్థాయి వైద్య సిబ్బంది ని ర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.కనీసం రోగితో మాట్లాడి వారికి ధైర్యాన్నిచ్చి తగు సూచనలు సలహాలు చేసి వాళ్ళ పరిమితి మేరకు చికిత్స అందించాల్సిన వైద్య సిబ్బంది...అందుకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీంతో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వారి ని ర్లక్ష్య వైఖరి వల్ల విలువైన ప్రాణాలు కోల్పో యే పరిస్థితులు రావొచ్చేమో నన్న ఆందోళనలో పడ్డారు.
ఇది అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రిలో క్రింది స్థాయి వై ద్య సిబ్బంది పని తీరు.తాజాగా ఓ సంఘట న వెలుగులోకి వచ్చింది. ఉండవల్లి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన మ ల్లికార్జున అనే ఓ యువకుడు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఆకస్మాత్తుగా గుండెకు సంబంధించిన సమస్యతో తీవ్ర అ స్వస్థతకు గురై చికిత్స నిమిత్తం స్థానిక వంద పడకల ఆసుపత్రికి వచ్చారు.
ఓపీ తీసుకునే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితు డు వివరాలు చెప్పడంలో కాస్త ఇబ్బంది ప డ్డాడు.దీంతో వైద్య సిబ్బంది బాధితుడి పట్ల నీ డ్రామాలు ఆపు... అంటూ కోపంతో నిర్లక్ష్యంగా మాట్లాడడం చర్చనీయంగా మారిం ది.వెంటనే అదే సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ రోగితో మాట్లాడి పరిస్థితిని పరీక్షించి సీరియస్ కేసుగా పరిగణించించి మెరు గైన వైద్య చికిత్స కోసం బాధితుడికి వివరించినట్లు తెలిసింది.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుడు కర్నూల్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి అడ్మిన్ అయ్యి చికిత్స పొందుతూ... ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు.అయితే ఎంతో మంది నిరుపేదలు అనారోగ్య సమస్యలు వచ్చినపుడు వైద్య సేవల కోసం ఆసుపత్రి వస్తారు.
విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వైద్య సిబ్బంది వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన సంబంధిత జిల్లా ఉన్నత అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చొరవ తీసుకోవాలని పలువురు రోగులు కోరుతున్నారు.