calender_icon.png 15 November, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్‌ను సందర్శించిన తమిళనాడు హెల్త్ సెక్రటరీ

10-08-2024 04:33:11 AM

ఖైరతాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): దాదాపు వంద సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన నిమ్స్ (నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) ఆసుపత్రిని శుక్రవారం తమిళనాడు హెల్త్ సెక్రటరీ సుప్రియా సాహు సందర్శించారు. నిమ్స్‌లోని వివిధ విభాగాలను సందర్శించిన ఆమె ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి డైరెక్టర్ నగరి బీరప్పను అడిగి తెలుసుకున్నారు. మెట్టు రంగారెడ్డి స్పెషల్ రూమ్స్, డయాల సిస్ విభాగంలో టెలీ డయాలసిస్ విధానం ద్వారా దూర ప్రాంత కిడ్నీ రోగులకు అందుతున్న సేవల గురించి డాక్టర్ గంగాధర్ వివరించారు. నిమ్స్‌లో అన్నివ ర్గాల వారికి అందుతున్న సేవలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్  ఆర్‌వి.కర్ణన్, ప్రొఫెసర్లు రామ్‌మూర్తి, స్వర్ణలత, సీనియర్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.