calender_icon.png 19 August, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షం... రైతులకు అపార నష్టం..

19-08-2025 12:50:35 AM

నీట మునిగిన పంట పొలాలు

తాండూరు, 18 ఆగస్టు, (విజయక్రాంతి) గత రాత్రి నుండి తాండూర్ నియోజకవర్గంలోని పెద్దముల్, యాలాల , బషీరాబాద్, తాండూరు మండలాల్లో మరో మారు గత రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుంది. వాగులు వంకలు పొంగి పొర్లడమే కాకుండా పంట పొలాల్లోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతుంది. కొన్ని పొలాల్లో వరద నీరు భారీగా ప్రవహిస్తుంది కూడా పంట పొలాలు నీట మునగడంతో రైతన్నలకు అపార నష్టం కలుగుతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతవారం కురిసిన భారీ వర్షాలకు అంతర పంటలైన పెసర, మినుము పంటలు చేతికందకుండా పోయాయి. ఇక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కంది మరియు పత్తి పంటలు నష్టం వాటిలో పరిస్థితి దాపరిచిందని అప్పులు చేసి పంటల కోసం పెట్టుబడులు పెట్టి వర్షాలతో తీవ్ర నష్టం అప్పులు తీరేలా పంటలు పండే అవకాశం లేకుండా పోతుంద ని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.