calender_icon.png 19 August, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

19-08-2025 12:51:43 AM

 పరిగి, ఆగస్టు -18 (విజయ క్రాంతి )సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సోమవారం పరిగి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నివాసం వద్ద బిఆర్‌ఎస్ నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీడిత జనుల కోసం బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని దార పోసిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీపీ అరవింద్ రావు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, భాస్కర్, హనుమంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ తాహెర్ అలీ, బిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్, సేవ్య నాయక్, బలాల, తదితరులుపాల్గొన్నారు.