12-11-2025 12:00:00 AM
ఢిల్లీ బాంబు పేలుడు ఘటనతో భారత్, సౌతాఫ్రికా జట్ల కు భారీ భద్రతను కల్పిస్తున్నారు. క్రికెటర్లు బస చేసే హోటల్‌తో పాటు స్టేడియం దగ్గర సెక్యూరిటీని భారీగా పెంచా రు.ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా అభిమానులను స్టేడియంలోకి అనుమతించడం లేదు. మ్యాచ్ జరిగే రోజు కూడా ఈడెన్ గార్డెన్స్‌కు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. అభిమానుల ఐడీకార్డులను తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నట్టు తెలుస్తోంది.