22-11-2025 12:00:00 AM
తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యం ప్రతి డిపోకు కొత్త బస్సులు మంజూరు చేయాల్సిన అవసరముంది. నగరంలోని చాలా డిపోల్లో ఇప్పటికీ పాత, డొక్కు బస్సులనే అధికంగా వినియోగిస్తున్నారు. ఈ బస్సులు కండీషన్ సరిగ్గా లేకపోవడంతో నిత్యం బ్రేక్‌డౌన్‌కు గురవుతున్న బస్సులు ఎక్కడ పడితే అక్కడే ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
అంతేకాదు రద్దీ వేళల్లో బిజీగా ఉండే రూట్లలో బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రయాణికులు పరిమితికి మించి ఎక్కుతుండడంతో డ్రైవర్లు అతికష్టం మీద బస్సులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ఒక్కోసారి ఆ బస్సులు కూడా మధ్యలోనే ఆగిపోతుండడంతో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే నగరంలోని డిపోల్లో పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు మంజూరు చేయాలని కోరుతున్నాం. అంతేకాదు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బిజీ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచితే బాగుంటుంది.
షేక్ అస్లాం షరీఫ్, హైదరాబాద్