calender_icon.png 14 May, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక్కడ మబ్బులు ఎక్కడ ముగ్గులు

19-08-2024 12:00:00 AM

గాలి విపరీతంగా ఎడతెరిపి లేకుండా ప్రాణం పోసే గాలి ప్రాణం తీసే కొడవలై చినుకు పడదు వాన కురియదు ఎగరేసిన బెలూన్లలా మబ్బులు కదలాడితే ఊరిలోని ప్రతీ గుడిసె ఆనందం నిలువెల్లా శివమెత్తి రసగంగై జాలువారు ప్రతి దెండం ఏర్లు లేవు బోర్లు లేవు గోదావరి గలగలలు కృష్ణమ్మ కిలకిలలు తుంగభద్ర మిలమిలలు లేవు చూసినా ప్రేమించినా పిలిచినా కొలిచినా మబ్బుల్నే విషాదాలు ముసిరినా వినోదాలు విరిసినా మబ్బుల్నే వానకై అక్కడ చూడు వరదపాశం వండుతూ భావపుంజిత రాగరంజిత గానాల్తో బోనాలెత్తుతూ కప్పల్ని రోకళ్ళకి కట్టి ఊరేగిస్తూ జీవజలధారం మబ్బే ప్రకృతి ప్రసాదం మబ్బే మబ్బు గొడుగుల్లో విచ్చుకునే ఆత్మవిశ్వాసం మబ్బు అడుగుల్లో నడ్చుకునే శక్తి సామర్థ్యం మబ్బమ్మా గాలి సైగలకి ఏ తీరాలకు నీ పయనం గాలి మాటలకి ఏ గమ్యాలకు నీ ప్రయాణం ఇక్కడ మబ్బులు ఎక్కడ మొగ్గలు ఇక్కడ మబ్బులు ఎక్కడ ముగ్గులు మబ్బమ్మా నీవే మా దేవతవి వానలు అందించు వరాలు ప్రసాదించు.

- బొమ్మిదేని రాజేశ్వరి

9052744215