calender_icon.png 27 October, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల ఆశయాలను నెరవేర్చాలి

27-10-2025 12:47:48 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మహనీయుల ఆశయాలు నెరవేర్చాలని ఎమ్మెల్యే  కోవ లక్ష్మి అన్నారు. ఆదివారం తిర్యాణి మండలం ఎదులాపాడ్ గ్రామంలో గిరిజన ఉద్యమ నేత, అమరజీవి వెడ్మ రాము 38వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి ఎమ్మెల్యే  పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వెడ్మ రాము  త్యాగాలను గుర్తు చేశారు. గిరిజనుల ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం పోరాడిన మహనీయుడు వెడ్మ రాము.

వారి ఆశయాలను, పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్య త మనందరిపై ఉందన్నారు. తెలిఈ కార్యక్రమంలో డిడి రమాదేవి, జిసిడి ఓ శకుం తల, ఏటిడిఓ చిరంజీవి, గిరిజన క్రీడల జిల్లా అధికారి మడావి షేకు, గిరిజన సంఘాల పెద్దలు, మండల ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.