calender_icon.png 21 August, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో పోటీలోలేని భారత్ లేబర్ ప్రజా పార్టీ రద్దుకు ప్రతిపాదన

21-08-2025 12:29:59 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 20, (విజయ క్రాంతి):ఎన్నికల్లో పోటీలో లేని రాజకీయ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి తొలగించాలని ప్రతిపాదిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ లేబర్ ప్రజా పార్టీ గత ఆరు సంవత్సరాలుగా జరిగిన లోక్సభ ఎన్నికలలో గాని, రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గాని, ఉప ఎన్నికలలో గాని తమ అ భ్యర్థులను పోటీకి నిలబెట్టలేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం1951 లోని సెక్షన్ 29A ప్రకారం ఆ పార్టీ విధివిధానాలు అమలు చేయకపోవడం స్పష్టమైందని కలెక్టర్ వివరించారు. ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం1951 లోని సెక్షన్ 29A క్రింద ఎన్నికల కమిషన్ తన అధికారాలను వినియోగించుకుంటూ, పై పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి తొలగించేందుకు ప్రతిపాదన చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రాతినిధ్యం ఏమైనా ఉంటే ఆ పార్టీ అ ధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి ఈ నెల 25వ తేదీ లోగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి అఫిడవిట్ సమర్పించవలసిందిగా సూచించారు. ఈ నెల 29వ తేదీన విచారణ నిర్వ హించనున్నందున పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు.ఎలాంటి సమాధానం రాకపోతే, పార్టీ తరపున ఏ అభ్యంతరం లేనట్టుగా పరిగణించి, ఎన్నికల కమిషన్ రద్దు ఉత్తర్వులు జారీ చేస్తుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.