calender_icon.png 30 May, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియా ప్రాతినిధ్య సంఘం ప్రతినిధులతో నెలవారీ సమావేశం నిర్వహణ

28-05-2025 07:04:07 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలో జీఎం కార్యాలయం నందు ఏరియా యాజమాన్యం, ఏరియా ప్రాతినిధ్య సంఘం ప్రతినిధుల మధ్య ఏరియా స్థాయి నెలవారీ సమావేశం ఏరియా జీఎం వి కృష్ణయ్య(Area GM V Krishnaiah) అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (Singareni Coal Mines Labour Union-INTUC) తరపున జే.వెంకటేశ్వర్లు ఏరియా వైస్ ప్రెసిడెంట్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు ఇల్లందు ఏరియాలో పనిచేసే కార్మికులు వారి పని స్థలాలలో ఎదుర్కొనే పలు సమస్యలను, విన్నపాల గురించి ప్రాతినిధ్య సంఘం తరపున ఏరియా జీఎం దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కార దిశకై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం వి.కృష్ణయ్య స్పందించి, సాధ్యమయ్యంతవరకు ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జి.యం. రామస్వామి, కే.ఓసి. పి. ఓ గోవింద రావు, జెకె. ఓసీ పి. ఓ. కృష్ణ మోహన్ ఏరియా ఇంజనీర్ ఆర్వీ నరసింహరాజు, డీజియం(సివిల్) రవికుమార్, సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, ఏరియా వర్క్ షాప్ పవన్ కుమార్, క్రిస్టఫర్, దిపిప్ కుమార్ ప్రాతినిధ్య సంఘం తరపున, కే.సత్యనారాయణ ఆర్.బాబు రావు, పి. మాధవ రావు, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.