calender_icon.png 30 May, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మహంకాళమ్మకు పోచమ్మ బోనాలు

28-05-2025 07:11:15 PM

కొండపాక: రేణుక ఎల్లమ్మ పునః ప్రతిష్టలో భాగంగా బుధవారం నాడు గ్రామ దేవతలకు గౌడ కులస్తులు బోనాలు చేశారు. కుకునూర్ పల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తులు కుల దైవం ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా బుధవారం ప్రజలు, మహిళలు మహంకాళమ్మకు పోచమ్మలకు బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు ఉదయం నుండి ఎల్లమ్మ దేవాలయంలో గణపతి పూజ, పుణ్యవచనం, కంకణధారణ, దేవత విగ్రహల శ్రీమ ప్రదక్షణ, జలాదివాసము, ప్రదోష పూజ తదితర కార్యక్రమాలు చేపట్టారు.