15-11-2025 08:21:12 PM
మనోహరాబాద్ (విజయక్రాంతి): ప్రజ్ఞాపూర్ లో జరిగిన యస్ జి ఎఫ్ ఉమ్మడి జిల్లాల నెట్ బాల్ ఎలక్షన్ లో మనోహరాబాద్ మండలంలోని జెయంజె. పాఠశాలకు చెందిన విద్యార్థినిలు అండర్ 14 విభాగంలో మొక్ష శ్రీ, అండర్ 17 విభాగంలో చైత్ర రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ కె అనిత తెలిపారు. విద్యార్థుల ఎంపికపై మండల ఎంఈఓ మల్లేశం గుప్తా ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రీడల పట్ల మంచి ప్రోత్సాహం అందిస్తున్న ప్రిన్సిపాల్ కు పిఈటి. మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీరి ఎంపికపై పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.