calender_icon.png 10 September, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళోజీ ఆశయాలను కొనసాగించాలి..

09-09-2025 10:01:16 PM

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..

జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): ప్రజా కవి కాళోజీ ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్(District Collector Satya Prasad) అన్నారు. కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ భవనంలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాకవి కాళోజీ సేవలు, తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషిని కొనియాడారు. అయన రచనలు తెలంగాణ సంస్కృతి, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రతిబింభించాయని తెలిపారు.  తెలుగు భాషా మాధుర్యం, సంపద, సంస్కృతి కలిగిన భాష అని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాళోజి జయంతి సందర్బంగా ప్రతియేట సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుని, రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక కళాకారులను గుర్తించి ప్రభుత్వం పురస్కారాలు అందిస్తుందని తెలిపారు. తెలుగు భాషపై అమితమైన ప్రేమను కలిగిన కాళోజి ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.సి వెల్ఫేర్ అధికారిణి జి.సునీత, జిల్లా గ్రామీనాభివృద్ధి శాఖ అధికారి రఘువరన్, డిపివో మదన్మోహన్ తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.