calender_icon.png 16 September, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్కాపూర్‌ను సందర్శించిన యూపీ ప్రతినిధులు

16-09-2025 12:03:09 AM

తూప్రాన్, సెప్టెంబర్ 15 :తూప్రాన్ మండలంలో ఆద ర్శ గ్రామమైన మల్కాపూర్ గ్రామాన్ని సోమవారం ఉత్త ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు సందర్శించారు. గ్రా మంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి వారు కొనియాడారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని గ్రామస్తులు తెలిపిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

మల్కాపూర్ ప్రజలు ఏ విధంగా గ్రామ అభివృద్ధికి పాటుపడ్డారో వివరిస్తూ ఇందులో ముఖ్యంగా హరితహారంలో భాగంగా ఏపుగా పెరిగిన చెట్లు, ప్రతి వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం, ఇంటింటికి మంచినీటి కనెక్షన్, ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామానికి అన్ని వసతులతో కూడిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనం, స్కూల్ భవనాలు, అంగన్వాడి కేంద్రాలు ఇలా అనేక వాటిని నిర్మించుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మా గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో వీటిని సాధిం చుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యూపీ ప్రతినిధులు, ఎంపీడీవో సతీష్, ఎంపీఓ, ఏపీవో, సెక్రటరీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.