calender_icon.png 30 January, 2026 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో లబ్దికోసం కేసీఆర్‌కు సిట్ నోటీసులు

30-01-2026 01:06:51 AM

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, 

మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్

వనపర్తి, జనవరి 29 ( విజయక్రాంతి ) : ప్రభుత్వ వ్యతిరేకతను,పాలన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మున్సిపల్ ఎన్నికలలో లబ్ధిపొందడానికి సిట్ విచారణ పేరుతో కె.సి.ఆర్ గారికి నోటీసులు అందజేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ లు తీవ్రంగా ఖండించారు. గురువారం జిల్లా కేంద్రం లోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నేడు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు వై.ఎస్.ఆర్,చంద్రబాబు నాయుడు వంటి వారికంటే బలవంతులు కారన్నారు. ప్రభుత్వం చేసే చిలిపి,చిల్లర చేష్టలతో వారి మీద ప్రజలు అసహ్యం,ఏహ్యభావం ఏర్పడుతుందని స్పష్టం చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో బరిగీసి బారాబర్ కోట్లాడుతాం బి.ఆర్.ఎస్ జండా ఎగరవేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశములో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మాజీ మున్సిపల్ చైర్మన్లు బి.లక్ష్మయ్య, పలుస రమేష్ గౌడ్,గంధం. బాలపీరు,గులాం ఖాదర్ ఖాన్,బొబ్బిలి.ప్రేమ్ కుమార్, వెంకట్ సాగర్,జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, నీలస్వామి,జానంపేట.శ్రీనివాసులు,నందిమల్ల రవి తదితరులు ఉన్నారు.