24-09-2025 12:52:47 AM
ఘట్ కేసర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలోని బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయితేజ సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక హాస్టల్లోనే సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈసంఘటనకు కారకులైన సీనియ ర్లను కఠినంగా చర్యలు తీసుకోని శిక్షించాలని అదే విధంగా కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దార్థ ఇంజరింగ్ కళాశాల ఎదుట ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్దఎత్తున ధర్నా చేయడం జరిగింది. పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోచారం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.