28-08-2025 04:17:41 PM
పునరావాస కేంద్రాల్లో బాధితులు
సదాశివనగర్ (విజయక్రాంతి): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ఉత్తునూర్, పద్మావాడి, తిర్మన్ పల్లి, మూడేగాం, వజ్జెపల్లి తండా గ్రామాల్లో పలువురి ఇండ్లు కూలిపోయినవి. నిర్వాసితులను అధికారులు పునరాసవాస కేంద్రలను ఏర్పాటు చేసి అందులోకి తరలించారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ముందస్తుగానే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు.